3 కోతుల concept
చైనా లో పుట్టి
జపాన్ లో పెరిగి
గాంధీ తో famous అయింది.
అసలు కోతులను హనుమంతుని అవతారంగా భావిస్తే, హిందువులు ఆటవిడుపు లేదా హాస్యం కోసం వానరాలను వాడుకోరు.
Wednesday, June 10, 2026
Monday, June 8, 2026
కట్టర్ హిందూ
" కట్టర్ హిందూ " అంటే ఏంటో అందరికీ సులభంగా అర్థమయ్యే, సరళమైన భాషలో చెప్పాలంటే :
" ఆశా, శ్వాసా, ధ్యాసా "
కేవలం హిందుత్వమే, హిందూ బంధుత్వమే
"మానసా, వాచా, కర్మణా"
" మనసులో " హిందుత్వమే
" మాటల్లో " హిందుత్వమే
" చేతల్లో "" కూడా " హిందుత్వమే
" కొరకున్ " (కొరకు), " కై "
సనాతన హిందుత్వం " కొరకు " - "ఆరాటం"
హిందువుల " హక్కులు " , " భద్రత " " కై " - " పోరాటం "
" To " Hindus, " For " Hindus, " By " Hindus.
" ఆలోచనల్లో " హిందుత్వమే
" ఆచరణలోనూ " హిందుత్వమే
గోమాతల " సంరక్షకుడు "
సనాతన హిందూ ధర్మ " రక్షకుడు "
సంస్కృతి, సంప్రదాయాల " పరిరక్షకుడు "
" ఆకాంక్ష "
" శ్రీ రామ రాజ్యమే "
" అఖండ భారతావనే "
" సనాతన ధర్మ పాలనే "

Wednesday, June 3, 2026
సంస్కృతాన్ని రక్షించండి
సంస్కృతం ఒక దైవ బాష. సంస్కృతంలో నుండి ఎన్నో భాషలు పుట్టుకు వచ్చాయి. ఇతర భాషల్లో సాంస్కృత పదాలు చేర్చబడ్డాయి. ఆధ్యాత్మికంగా చెప్పాలంటే, దాదాపు ప్రతీది సంస్కృతంలోనే ఉంటుంది. ఉదాహరణకు వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, శాస్త్రాలు, శ్లోకాలు, మంత్రాలు ఇలా ప్రతీది. సంస్కృతం యుగాల నుండి ఉన్నది. అత్యంత ప్రాచీన బాష సంస్కృతం.
అలాంటి సంస్కృత బాష నేడు కనుమరుగయ్యే దీనస్థితిలో ఉంది (అధికారిక రికార్డుల్లో). నిజ జీవితంలో అయితే భారతీయుల్లో, ముఖ్యంగా హిందువుల దైనందిన జీవితంలో, సంస్కృతం ఒక భాగం. హిందువు అన్నవాడు రోజుకు కనీసం ఒక్క శ్లోకం అయినా చదువుతాడు, చదవకపోతే చదవాలి. ఆ లెక్కన చూస్తే, అందరికీ సంస్కృతం వచ్చనే కదా దాని అర్థం?
అధికారిక రికార్డుల కోసం లేదా లెక్కల కోసం ఎవరైనా మిమ్మల్ని సంప్రదిస్తే లేదా అడిగితే, మీకు వచ్చిన భాషల్లో సంస్కృతం కూడా ఒకటని చెప్పండి. ప్రభుత్వం, భాషల బాగు కోసం, ఇచ్చే ప్రోత్సాహకాల కోసమైనా అలా చెప్పండి. సంస్కృతాన్ని బ్రతికించిన వారిమి అవుతాము.

Sunday, May 31, 2026
కోరాల్సిన కోరిక
"భక్త, నీ భక్తికి మెచ్చితిని
ఏమి కావాలి నాయనా, కోరుకో"
స్వామి నేను,
ఆయాసం - కష్టం లేకుండా
మంచాన పడకుండా
ఎవరికీ భారం కాకుండా
ప్రశాంతంగా కన్నుమూయాలి
బ్రతికినంత కాలం ఎవరి ముందూ చేతులు చాచకుండా, ఆత్మగౌరవంతో, దైన్యం లేని జీవితాన్ని గడపాలి
చనిపోయే ముందు, నేను మిమ్మల్ని చూడాలి, మీ సన్నిధిలో, మీ సమక్షంలోనే నేను చావాలి. ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మీ పాదాల చెంతకు చేరాలి, మోక్షాన్ని పొందాలి
ఓ పరమశివా! ఇంతకన్నా నాకు ఇంక ఏమీ వద్దు స్వామి.
"చాలా తెలివిగా ఏమీ కోరకుండానే, మనిషి జీవితానికి కావాల్సిన ముఖ్యమైనవి అన్నీ కోరేసావు"
"తథాస్తు"

Thursday, May 28, 2026
సావర్కర్ ప్రత్యేకత, గొప్పతనం
80,000 పైగా రాజకీయ నాయకులు మరియు స్వాతంత్య్ర సమర యోధులు, అండమాన్ జైలులో ఖైదు చేయబడ్డారు, *"కాలాపాని"* శిక్షను అనుభవించారు. ఎంతో మందికి ఉరి శిక్షలు కూడా పడ్డాయి. ఉల్లాస్కర్ దత్, 18 సంవత్సరాలు శిక్ష అనుభవించి, బయటకు వచ్చి, పిచ్చి వాడయ్యాడు.
సావర్కర్ గారికి, రెండుసార్లు జీవిత ఖైదు, మొత్తం 50 సంవత్సరాలు శిక్ష పడింది నిజమే. కానీ, కఠిన శిక్షను అనుభవించింది 14 సంవత్సరాలు.
అంతకన్నా ఎక్కువ సంవత్సరాలు శిక్షను అనుభవించిన వారు కూడా ఉన్నారు, లేరని కాదు గానీ, వీర్ సావర్కర్ ప్రత్యేకత ఏంటంటే, ఆయన "ఆధునిక హిందుత్వ సిద్ధాంత కర్త" ఈ *పుస్తకాలు* చదివితే, సావర్కర్ గారి గురించి పూర్తిగా అర్థం అవుతుంది.
"Essentials Of Hindutva"
"The Indian War of Independence 1857"
"Hindutva"
"Savarkar: The True Story of the Father of Hindutva"
"Savarkar and the Making of Hindutva"
"Veer Savarkar: Allegations & Reality"
"My Transportation for Life"

Tuesday, May 26, 2026
సనాతనం
సకల జన హితం
ఎల్లవేళలా శ్రేయస్కరం
ఆ ఈశ్వరుని సంకల్పం
"సనాతన హిందూ ధర్మం"
అత్యుత్తమమైన జీవన విధానం
అత్యంత యోగ్యమైన ధర్మ మార్గం
సంస్కృతి సంప్రదాయాల సంఘమం
సద్గుణ సుసంపన్నం మన "సనాతనం"
ఎల్లవేళలా శ్రేయస్కరం
ఆ ఈశ్వరుని సంకల్పం
"సనాతన హిందూ ధర్మం"
అత్యుత్తమమైన జీవన విధానం
అత్యంత యోగ్యమైన ధర్మ మార్గం
సంస్కృతి సంప్రదాయాల సంఘమం
సద్గుణ సుసంపన్నం మన "సనాతనం"
దృష్టికోణం
మనుషులలో ఎన్నో రకాలు ఉంటారు.
కొందరిలో తామస గుణం ఉంటుంది
కొందరిలో రజో గుణం ఉంటుంది
ఇంకొందరిలో సాత్విక గుణం ఉంటుంది
"పురుషులందు పుణ్య పురుషులు, వేరయా"
అందరూ "పురుషోత్తములు" కాలేరు.
ప్రతీ "రాజూ" పురుషోత్తమ, మర్యాద "శ్రీ రామ చంద్రుడు" కాలేడు
మీకు హనుమంతుడు, కేవలం ఒక "వానరుడు" మాత్రమే. కాని నాకుమాత్రం, "రుద్రావతారం".
తేడా అంతా కేవలం:
చూసే చూపులో ఉంటుంది
భక్తి భావంలో ఉంటుంది
కొలిచే తీరులో ఉంటుంది
పిలిచే పిలుపులో ఉంటుంది
కన్నీటి ఆర్ద్రతలో ఉంటుంది
భక్తి పారవశ్యంలో ఉంటుంది
సమర్పించే నివేదనలో ఉంటుంది
దృష్టికోణంలోనే సమస్తం ఉంటుంది

హిందూ స్త్రీలు
దుర్మార్గుల దుశ్చర్యలపై (Love Jihad పై) అవగాహన కలిగి ఉండి, జాగృతమై, సురక్షితంగా ఉండి, అన్యాయాలను అరికట్టగలిగి, దురాక్రమణలను దుయ్యబట్టగలగాలి. అప్పుడే నిజమైన "సనాతన స్త్రీ శక్తి" చైతన్యవంతమైనట్టు.
Monday, May 25, 2026
లౌకిక హిందూ
పుట్టినప్పుడు అందరూ అమాయకులే, కానీ, పెరిగే కొద్దీ, వారి దుర్బుద్ధి కూడా పెరుగుతూ ఉంటుంది. ఆ దుర్బుద్ధితో నరమేధం చేసే వారు దుష్టులైతే, అలాంటి దుష్టులను కూడా వెనకేసుకువచ్చే వారు, అంతకంటే దిగజారిన దుష్ట అధములు.
Secular హిందువులపై చిన్న అనుమానమా? మీ భ్రమ అంతే, "అటూ ఇటూ కాని బ్రతుకు మాదని" వారికి వారే ఎప్పుడో చేసుకున్న "తీర్మానం" అది.
కొందరు "100%" "కట్టర్ హిందూ" అనుకున్నాను. కానీ, అందులో నుండి వారు తమంతట తామే కేవలం "1" ని మాత్రమే తీసేసుకుంటున్నారు, పర్లేదు, ఏమీ కాదని. కానీ, ఇప్పుడు వారి విలువ "00" అయిపోయింది.
నువ్వు గాం..ధీ నా? ఒక చంప పై కొడితే ఇంకో చంప చూపించడానికి? అయితే చంపలను వాయించుకోనా మరి, నాకు ఇష్టం వచ్చినంత సేపు?
రానున్న రోజుల్లో ఇలాంటివి మీకు అడుగడుగునా ఎలాగూ తప్పవు. ఇప్పటి నుండే కాస్త అలవాటు చేసుకుంటే, మీకే చాలా మంచిది. ఎందుకంటే, రానున్నది "రామ రాజ్యం".
"జై శ్రీరామ్"
"జై జై శ్రీరామ్"
"సదా", "సర్వదా", "సనాతన హిందూ జనాః సుఖినో భవన్తు"

Saturday, May 23, 2026
హిందుత్వం అంటే ఖర్చా?
డబ్బులు ఏమీ ఖర్చు చేయకుండా, తిరుపతి లాంటి ప్రముఖ ఆలయాల్లో కూడా ఉచిత దర్శనం చేసుకొని, భోజనం కూడా చేసి రావచ్చు.
ఉచిత దర్శనం లేదా?
అన్నదానం చేయడం లేదా?
తొందరగా వెళ్లాలి అనుకునే వారికి ప్రత్యేక దర్శన టికెట్.
ఈ మధ్య నాస్తికులు, హిందూ ద్వేషులు, మరకలు, గొర్రెలు రకరకాల కుట్రలు పన్నుతున్నారు. అందులో ఒక రకమైన కుట్ర ఇది.
వాళ్లు చెప్పాలనుకున్నది ఏంటి అంటే, హిందుత్వం అంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అని.
అగరబత్తులకు, టెంకాయలకు, దర్శనానికి, అర్చకుని పళ్లెంలో వేయడానికి దక్షిణ, హుండీలో వేయడానికి దానం, బిక్షగాలకు వేయడానికి దానం, చెప్పుల స్టాండు టికెట్, పార్కింగ్ లాట్ లో టికెట్టు - ఇలా ఇన్ని రకాల ఖర్చులు ఉంటాయి.
అంటే, హిందువులు ఆలయానికి వెళ్లాలంటే, దేవుడి దర్శనం చేసుకోవాలంటే, ఇన్ని రకాల ఖర్చులు అని. అదే మా చర్చిలో అయితే, ఎటువంటి ఖర్చు లేదు అని చెప్పుకుంటారు.
కానీ నిజానికి హిందువులు దీపారాధన చేస్తే, క్రైస్తవులు కొవ్వొత్తులు వెలిగించరా? ఏంటి కొవ్వొత్తులు ఊరికే వస్తాయా డబ్బులు లేకుండా?
దర్గాలపైన కప్పడానికి చాదర్ లు తీసుకెళ్తారు, అవి ఊరికి వస్తాయా?
ఈ పార్కింగ్ లాట్లు, టోకెన్లు చెప్పుల స్టాండ్ లో ఇవన్నీ ఉండేవి ప్రముఖ దేవాలయాల్లో మాత్రమే. అత్యంత రద్దీగా ఉండే దేవాలయాల్లో మాత్రమే. అన్ని దేవాలయాల్లో అలాంటి పరిస్థితి ఉండదు.
ఇక రద్దీగా ఉండే ప్రదేశాల్లో, పార్కింగ్ లకి ప్రతిదానికి వేరు వేరుగా ఖర్చు చేయాల్సి వస్తుంది. సినిమా కెళ్లినా సరే, సినిమా థియేటర్లో ఖర్చు చేయరా? దర్గాల్లో టెంకాయకి వంద రూపాయలు తీసుకొని ఇవ్వరా?
ఏదో మంత్రం పేరు చెప్పి వందలు, వేలు లాగరా?
దయ్యం పట్టిందని వంకలు చెప్పి, భయపెట్టించి, వేల రూపాయలు లాగరా?దాని గురించి ఎందుకు ఎవరూ మాట్లాడరు?
ప్రభువు దానం చేయమన్నాడు అనేసి, దానం చేస్తే మంచిదనేసి, చర్చికి వచ్చే వాళ్లతో బియ్యం సంచిలు కొనిపించి తెచ్చుకోరా?
నాకు తెలిసిన కొందరు మతం మారినా హిందువులు, లక్షల కొద్ది అప్పు చేసి మరీ దానాలు చేస్తున్నారు. చర్చి కోసము బియ్యం సంచులని, బట్టలు అనేసి అలాంటివే మరి కొన్ని. దాని గురించి మాట్లాడరేంటి?
ఉత్త చేతులతో గుడికి పోయి, దేవుడికి దండం పెట్టుకొని వచ్చేవారు లేరా?
అంతెందుకు శివయ్యకు ఓ చెంబుడు నీళ్లతో అభిషేకం చేస్తే, ప్రసన్నుడు కాడా ఏంటి?
హిందువులను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు, హిందుత్వం అంటేనే ఖర్చు అని.
ఉత్త చేతులతో గుడికెళ్లి కూడా దండం పెట్టుకుని రావచ్చు, వీలైతే ఒక చెంబెడు నీళ్లు, లింగంపై పోసినా చాలు. గుడుల బాగోగులు చూసుకోవడానికి, ప్రభుత్వం ఉంది, ఈ రోజుల్లో రాజులు లేరు కాబట్టి. ఆలయాల నుంచి వచ్చే డబ్బు/ఆదాయం హిందువులకు మాత్రమే ఖర్చు చేయాలని అడగండి. అంతేగాని దానికి ఇంత టికెట్, దీనికి ఇంత టికెట్ అని అనకండి. సెక్యులర్ పార్టీలకు ఓటు వేసి, వారిని గెలిపించి, వారికి అధికారం ఇస్తే, ఇలాంటివే జరుగుతాయి. కాబట్టి కట్టర్ హిందూ పార్టీలకు మాత్రమే ఓటు వేసి గెలిపించాలి. అప్పుడుగాని మన గుడుల నుంచి వచ్చే ఆదాయం, మన గుడులకు, హిందువులకు మాత్రమే ఖర్చు చేస్తారు. దీనికి పరిష్కారం - పార్టీలు, బూటకపు సెక్యులరిజం ప్రదర్శించకుండా చూసుకోవాలి. కేవలం కట్టర్ హిందూ పార్టీలకు మాత్రమే ఓటు వేయాలి, అధికారాన్ని అందించాలి.

Friday, May 22, 2026
కృత్రిమ మాతృత్వం
మాతృత్వం అంటేనే ఒక మధురానుభూతి. పిల్లలు కూడా రెడీమేడ్ కావాలంటే ఎలా?
రెడీమేడ్ అంటే, అనాధ పిల్లలను దత్తత తీసుకోవడం అనుకునేరు, కాదు, Surrogacy.
ఇంతకుముందు గ్లామర్ తగ్గుతుందని తల్లులు, పిల్లలకు పాలు ఇవ్వడం మానేశారు. ఇప్పడు అయితే ఏకంగా పిల్లల్ని కనడం మానేస్తున్నారు.
"మాతృత్వంలో" ఉన్న "కిక్" "surrogacy", "డబ్బా పాల"లో ఎక్కడ ఉండి చస్తుంది.
ఈ "గ్లామర్ ప్రియ" మూర్ఖులకు అర్థం అయ్యేలా ఎలా చెప్పేది?
Celebrities అనేవారు, చాలా మందికి role model, inspiration లాంటి వారు. వీరిని ఆదర్శంగా తీసుకొని, "వెర్రి గొర్రె" జనాలు వారిని అనుసరిస్తే, మాతృత్వంలోని "మాధుర్యానికి" అటు తల్లులు, ఇటు పిల్లలు ఇరువురూ దూరం అవుతారు, "ఆ మాధుర్యాన్ని" పూర్తిగా ఆస్వాదించకుండా, దానిని కోల్పోతున్నారు.

Wednesday, May 13, 2026
గుర్తించండి, గౌరవించండి
చేసే మంచి పనిని మాత్రం గుర్తించరు. లేని వసతులు గురించి మాత్రం అడుగుతారు.
మన సౌకర్యం కన్నా, సనాతన ధర్మాన్ని కాపాడటం చాలా ముఖ్యం. ఆ విధంగా కృషి చేస్తున్నటువంటి TTD ని గౌరవించాలి.
ప్రతీ దానికి, ప్రతీ చోట, ప్రతీ ఒక్కరినీ విమర్శించడం సరైనది, సహేతుకమైనది కాదు.
మీరు, నేను తిరుపతిలో గడిపే సమయం ఎంత? మరి గుడులు ఉండే కాలం ఎంత? TTD, ఎన్నో వేల గుడులను నిర్మిస్తోంది. నిత్యాన్నదానంతో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తోంది.
దైవ దర్శనానికి వచ్చి, కాస్త అసౌకర్యానికి గురైతే, సర్దుకుపోవాలి.
అసౌకర్యం గురించి ప్రశ్నించే వారు, గుడులపై, ధర్మంపై దాడులు జరిగినప్పుడు కూడా ప్రశ్నించాలి.

Saturday, May 9, 2026
మాతృ దినోత్సవం
మాతృ దినోత్సవం, విదేశీయులు చేసుకుంటారు. అక్కడ పిల్లలకు 15 సంవత్సరాలు రాగానే, లేదా తల్లిదండ్రులు విడి విడిగా ఉంటారు కాబట్టి, ఆ వంకతో అయినా తల్లిని తలచుకోవడానికి జరుపుకుంటారు.
భారతదేశంలో కుటుంబ వ్యవస్థ విదేశాల కంటే చాలా బలంగా ఉంది. ఇక్కడ దాదాపు చనిపోయే వరకు అందరూ కలిసే ఉంటారు. కాబట్టి మనం ప్రత్యేకించి మాతృ దినోత్సవం, పితృ దినోత్సవం, తల్లిదండ్రులు దినోత్సవం, తాతముత్తాతల దినోత్సవం, కుటుంబ దినోత్సవం, సోదర సోదరిల దినోత్సవం జరుపుకోవాల్సిన అవసరం ఏమంత మాత్రం లేదు.
*భారతదేశంలో ప్రతి రోజూ పండుగ లాంటిదే.*
మన సనాతన హిందూ ధర్మం, మన సంస్కృతి, సంప్రదాయాలు, మన పెద్దలు-పూర్వికులు నేర్పిన కుటుంబ విలువలు, కట్టుబాట్లు అంత ఉన్నతమైనవి మరి.
అందుకే, మన ఆచారాలను ఆచరించండి, సంస్కృతి, సంప్రదాయాలను నిలబెట్టండి, తద్వారా మన ధర్మాన్ని కూడా కాపాడండి.
సనాతన హిందూ జనాః సుఖినో భవన్తు.

Tuesday, April 14, 2026
కృష్ణ నామ రసం - మధురాతి మధురం
మేఘ శ్యాముడు
నవనీత చోరుడు
గోవుల గోపాలుడు
గోపికల గోవిందుడు
గోవర్థన గిరిధరుడు
ముగ్ధ మనోహరుడు
రాధికా హృదయ హరుడు
మా వేణు మాధవుడు
గోకుల నందనుడు
బృందావన బ్రజేంద్రుడు
యశోద చిన్ని కృష్ణుడు
ఛలోక్తుల చిలిపి కృష్ణుడు
అచ్యుతుడు ద్వారకాధీషుడు
మథుర మందగమనుడు
ముద్దులోలికే ముద్దు కృష్ణుడు
జనుల జనార్ధనుడు
మృదు మధుసూదనుడు
అనంత అవతారుడు
చతుర చక్రధరుడు
జగన్మోహన లీలా కృష్ణుడు
సుదాముడి సుదర్శనుడు
కుచేలుని కుబేరుడు
పాండవ సఖుడు
ఇష్టసఖుల ప్రియదర్శనుడు
గోపీ జన వల్లభుడు
భక్త జన లోలుడు
రాసలీలల రసజ్ఞుడు
మన్మథుడికే పితరుడు
పార్థుని సారథుడు
వేద సార విశ్లేషకుడు
భగవద్గీత బోధకుడు
కురుక్షేత్ర మార్గనిర్దేశకుడు
నిందలను మోసినవాడు
అపనిందలను దూరం చేయువాడు
ప్రతిష్టను పెంచెడివాడు
విశ్వరూప దర్శనమిచ్చినవాడు
గొల్లభామల గొల్లవాడు
చిరుమందహాస ముఖుడు
క్లేశ నాశన కేశవుడు
నల్లవాడు మనందరివాడు
వస్త్రాలను తస్కరించినవాడు
వేడుకోగానే, చీరలనిచ్చి ఆదుకొన్నవాడు
బాధలను భరించు హరించు జగన్నాథుడు
ఆపన్నుల ఆపత్కాల ఆపద్బాంధవ అభయంకరుడు
నవనీత చోరుడు
గోవుల గోపాలుడు
గోపికల గోవిందుడు
గోవర్థన గిరిధరుడు
ముగ్ధ మనోహరుడు
రాధికా హృదయ హరుడు
మా వేణు మాధవుడు
గోకుల నందనుడు
బృందావన బ్రజేంద్రుడు
యశోద చిన్ని కృష్ణుడు
ఛలోక్తుల చిలిపి కృష్ణుడు
అచ్యుతుడు ద్వారకాధీషుడు
మథుర మందగమనుడు
ముద్దులోలికే ముద్దు కృష్ణుడు
జనుల జనార్ధనుడు
మృదు మధుసూదనుడు
అనంత అవతారుడు
చతుర చక్రధరుడు
జగన్మోహన లీలా కృష్ణుడు
సుదాముడి సుదర్శనుడు
కుచేలుని కుబేరుడు
పాండవ సఖుడు
ఇష్టసఖుల ప్రియదర్శనుడు
గోపీ జన వల్లభుడు
భక్త జన లోలుడు
రాసలీలల రసజ్ఞుడు
మన్మథుడికే పితరుడు
పార్థుని సారథుడు
వేద సార విశ్లేషకుడు
భగవద్గీత బోధకుడు
కురుక్షేత్ర మార్గనిర్దేశకుడు
నిందలను మోసినవాడు
అపనిందలను దూరం చేయువాడు
ప్రతిష్టను పెంచెడివాడు
విశ్వరూప దర్శనమిచ్చినవాడు
గొల్లభామల గొల్లవాడు
చిరుమందహాస ముఖుడు
క్లేశ నాశన కేశవుడు
నల్లవాడు మనందరివాడు
వస్త్రాలను తస్కరించినవాడు
వేడుకోగానే, చీరలనిచ్చి ఆదుకొన్నవాడు
బాధలను భరించు హరించు జగన్నాథుడు
ఆపన్నుల ఆపత్కాల ఆపద్బాంధవ అభయంకరుడు
Sunday, April 12, 2026
ఎవరికి ఈ స్సుఖినోభవంతు?
మౌనంగా ఉండడం మరియు సమస్యలకు దూరంగా ఉండడం, మన సమస్యలకు అసలైన పరిష్కారాలు కాదు.
పిరికితనం, చేతకానితనమే అనిపించుకుంటుంది.
సమస్యల నుండి తప్పించుకోవడమే అవుతుంది, పారిపోవడమే అవుతుంది .
హిందువులకు ఉన్నది ఒకే ఒక్క దేశం, భారతదేశం.
దాన్ని కూడా secular దేశం చేయడానికి, secular /pseudosecular గొర్రెల రకరకాల కుట్రలు, పన్నాగాలు.
హిందువులు అనాల్సింది
"లోకా స్సమస్తా స్సుఖినోభవంతు"
లేదా
"సర్వే జనా సుఖినో భవంతు"
అని కాదు
"సర్వే 'సు' జనా సుఖినో భవంతు"
లేదా
"సనాతన హిందూ జనాః సుఖినో భవన్తు".
అని అనాలి.

Tuesday, March 10, 2026
సమానమా? ఎక్కువ సమానమా?
పురుషులకు రక్షణ లేని రోజులు ఇవి. సగటు మగాడికి రక్షణ లేకుండా పోతోంది.
పురుషులకు భద్రత కల్పించాలి.
చట్టాలు - స్త్రీల వైపు
ప్రజా సంఘాలు, మానవ సంఘాలు - స్త్రీల వైపు
ఆఖరికి పురుషులు కూడా - స్త్రీల వైపే
మరి పురుషుల వైపు? ఎవరు లేరు
ఒక మగాడు తన గోడు ఎవరికి చెప్పుకోవాలి ఇక?
పురుష చట్టాలు రావాలి
మగవారిని స్త్రీల నుండి రక్షించాలి
ఒక మగాడి మనసును, సాటి మగాడే అర్థం చేసుకోగలడు
గృహ హింసకు గురైన పురుషులు, స్త్రీ పీడితులు, మహిళా బాధితులు ఏకం కావాలి
మగవారి ఐక్యత వర్ధిల్లాలి
పురుష జనోద్ధరణ జరగాలి
పురుషుడి విజయం, ఆడవాళ్లకు కట్ట బెట్టినప్పుడు
స్త్రీల విజయం, మగవాళ్లకు ఎందుకు కట్టబెట్టరు?
స్త్రీ పక్షపాతమా?
ఎవరి పోరాటం వారిది
ఎవరి జీవితం వారిది
స్త్రీ, పురుషులు అని విడదీయడం ఎందుకు?
మనిషి, మనుషులు అంటే సరిపోదా?
"స్త్రీ పురుషుడితో సమానం అంటూనే, స్త్రీని పురుషుడి కన్నా ఎక్కువ సమానం చేసేశారు. పురుష ఆధిక్య సమాజాన్ని కాస్త, స్త్రీ ఆధిక్య సమాజంగా మార్చేశారు."
ఇంకా స్త్రీ పక్షపాతం వహించడం మూర్ఖత్వమే అవుతుంది.
అదీ - ఇప్పుడు, ఈ రోజుల్లో కూడా.
100% నిజాయితీగా ఉండాలి అంతే.
అనునిత్యం, ఎల్లవేళలా సత్యం వైపు నిలబడాలి అంతే. పూర్తి నిబద్ధతతో ఉండాలి.
మనం చూడాల్సింది - న్యాయమా, అన్యాయమా అని మాత్రమే.
Just wrong or right, we should see and care about it.
నిజం ఎటు ఉంటే నేను అటు ఉంటా.
స్త్రీల వైపు ఉంటే, నేను కూడా సమర్ధిస్తా.
పురుషుడి వైపు ఉంటే, నేను ఒక మగాడిలానే ఆలోచిస్తా.
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపే వారు, పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేయాలి.

Monday, February 2, 2026
సమర్పణ
అన్నీ తెలిసిన వారి కన్నా
దేవుడు
ఏమీ తెలియని వారిని బాగా ఇష్ట పడతాడు
నిర్మలంగా, నిష్కల్మషంగా ఉండే వారంటే
దేవుడికి చాలా ఇష్టం
శాస్త్రోక్తంగా పూజలు చేసే వారి కన్నా
తెలిసీ తెలియక అపచరాలను చేసి
మనస్పూర్తిగా పూజించే వారిని
క్షమించి, ప్రేమగా దగ్గరకు తీసుకుంటాడు
భగవంతుడిపై మనకు
అపారమైన నమ్మకం ఉండాలి
అచంచలమైన భక్తి, ప్రగాఢ విశ్వాసం ఉండాలి
ఇక నీవే నాకు దిక్కంటూ
నీవు తప్ప నాకు వేరే దిక్కులేదంటూ
సర్వాంతర్యామి అయిన ఆ భగవంతుడిని వేడుకోవాలి
భారమంతా ఆ దేవుడిపై వేస్తూ
భగవంతుడిపై స్వచ్ఛమైన, నిశ్చలమైన భక్తి భావంతో
పూర్తి నమ్మకంతో
సమర్పణ భావంతో, చిత్తశుద్ధితో
శ్రద్ధతో, ఏకాగ్ర చిత్తంతో
మనని మనం
ఆ దేవ దేవుడికి అర్పించుకోవాలి.

Thursday, January 8, 2026
Sunday, January 4, 2026
अरे यारो
ये रूकापन-पिकापन-सूनापन-अधूरापन को छोड़ो
अपनी अपनी जीवन में मिर्च मसाला को जोड़ो
इतनी सन्नाटे के बाद तो यह खामोशी को तोडो
जिंदगी को महफिल और मेले की तरफ यू मोड़ों

Subscribe to:
Posts (Atom)