"భక్త, నీ భక్తికి మెచ్చితిని
ఏమి కావాలి నాయనా, కోరుకో"
స్వామి నేను,
ఆయాసం - కష్టం లేకుండా
మంచాన పడకుండా
ఎవరికీ భారం కాకుండా
ప్రశాంతంగా కన్నుమూయాలి
బ్రతికినంత కాలం ఎవరి ముందూ చేతులు చాచకుండా, ఆత్మగౌరవంతో, దైన్యం లేని జీవితాన్ని గడపాలి
చనిపోయే ముందు, నేను మిమ్మల్ని చూడాలి, మీ సన్నిధిలో, మీ సమక్షంలోనే నేను చావాలి.
ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మీ పాదాల చెంతకు చేరాలి, మోక్షాన్ని పొందాలి
ఓ పరమశివా! ఇంతకన్నా నాకు ఇంక ఏమీ వద్దు స్వామి.
"చాలా తెలివిగా ఏమీ కోరకుండానే, మనిషి జీవితానికి కావాల్సిన ముఖ్యమైనవి అన్నీ కోరేసావు"
"తథాస్తు"
No comments:
Post a Comment