Wednesday, June 3, 2026

సంస్కృతాన్ని రక్షించండి

సంస్కృతం ఒక దైవ బాష. సంస్కృతంలో నుండి ఎన్నో భాషలు పుట్టుకు వచ్చాయి. ఇతర భాషల్లో సాంస్కృత పదాలు చేర్చబడ్డాయి. ఆధ్యాత్మికంగా చెప్పాలంటే, దాదాపు ప్రతీది సంస్కృతంలోనే ఉంటుంది. ఉదాహరణకు వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, శాస్త్రాలు, శ్లోకాలు, మంత్రాలు ఇలా ప్రతీది. సంస్కృతం యుగాల నుండి ఉన్నది. అత్యంత ప్రాచీన బాష సంస్కృతం.

అలాంటి సంస్కృత బాష నేడు కనుమరుగయ్యే దీనస్థితిలో ఉంది (అధికారిక రికార్డుల్లో). నిజ జీవితంలో అయితే భారతీయుల్లో, ముఖ్యంగా హిందువుల దైనందిన జీవితంలో, సంస్కృతం ఒక భాగం. హిందువు అన్నవాడు రోజుకు కనీసం ఒక్క శ్లోకం అయినా చదువుతాడు, చదవకపోతే చదవాలి. ఆ లెక్కన చూస్తే, అందరికీ సంస్కృతం వచ్చనే కదా దాని అర్థం?

అధికారిక రికార్డుల కోసం లేదా లెక్కల కోసం ఎవరైనా మిమ్మల్ని సంప్రదిస్తే లేదా అడిగితే, మీకు వచ్చిన భాషల్లో సంస్కృతం కూడా ఒకటని చెప్పండి. ప్రభుత్వం, భాషల బాగు కోసం, ఇచ్చే ప్రోత్సాహకాల కోసమైనా అలా చెప్పండి. సంస్కృతాన్ని బ్రతికించిన వారిమి అవుతాము.

No comments:

Post a Comment