Monday, June 29, 2026

Self Motivation

All is well
Be positive
Just Do It
Be sportive
Take It Easy
Take It Positive
Just Chill
Be Cool
Go Ahead
Stop Not
Awake and Arise
Just Move On
Don't Get stressed
Don't Feel Failed
Believe In Your'self'
Get Refreshed
Start Again
No Look Back

शुभ शुभ बोलो
अखिले चलता जा कारवां बनतीं जाएगी
पीछे मुड़कर ना देख
होंसला मजबूत बना

అంతా మన మంచికే
గతం ఒక అనుభవం పాఠం
జరిగినదంతా గుణపాఠం నేర్వడానికే
యద్భావం తద్భవతిu
శతకోటి అపాయాలకు, అనంతకోటి ఉపాయాలు
ఆగితే సాగదు
ముందుకు సాగిపో
పట్టిన పట్టు వదలకు
నిన్ను నువ్వు విశ్వసించు
<శుభం పలుకు
ఒట్టి మాటలను కట్టిపెట్టి, మళ్ళీ గట్టిగా తలపెట్టు, ఘనంగా మొదలెట్టు
ఆత్మవిశ్వాసాన్నే అందలం చేసుకో

ఇవన్నీ కూడా మనకు సానుకూల ఆలోచన (Positive Thinking) చేయమని, సానుకూల దృక్పథాన్ని చెప్తున్నాయి, నేర్పుతున్నాయి.

ఏది ఏం జరిగినా సరే మధ్యలో ఆగవద్దు, చేసే పనిని పూర్తి చేయకుండా ఆపవద్దు.

ఆటంకాలను మరియు అడ్డంకులను అధిగమిస్తూ, ముందుకే సాగిపోవాలని నొక్కి మరీ నేర్పుతున్నాయి.

మనం పయనించే ఒక దారి మూసుకుపోయినా, ఇంకా ఎన్నో దారులు మిగిలి ఉన్నాయి. ఆలోచిస్తే, ప్రయత్నిస్తే అవి మనకు కనిపిస్తాయి, మన కోసం ఆ దారులు తెరుచుకుంటాయి కూడా.

ప్రయత్నించి విఫలం కావచ్చును ఏమో కాని, ప్రయత్నం లోపం వల్ల మాత్రం కానే కాకూడదు.

అసలు ప్రయత్నమే చేయకపోతే, మనం ఆశించిన ఫలమే మనకు దక్కదు కదా?

Sunday, June 21, 2026

ఆలయాల్లో వి.ఐ.పి బ్రేక్ దర్శనాలు

ఆలయాల్లో వి.ఐ.పి బ్రేక్ దర్శనాలను రద్దుచేయడం అయ్యే పని కాదు. ఒకవేళ అలా జరిగితే మాత్రం, గుడులు ఎన్నో మూతపడతాయి. బోసి పోతాయి, వెలవెలపోతాయి, కళా విహీనమవుతాయి. ప్రముఖులు ఎవరూ కూడా గుడులకు రారు. దానాలు, గుప్త దానాలు చేయరు. ఆలయాలకు నిధులు సమకూరవు.

అందరూ గంటల తరబడి క్యూలైనులో నిలబడలేరు. భక్తులలో రోగులు ఉంటారు, పసి పిల్లలతో బాలింతలు ఉంటారు, వృద్ధులు ఉంటారు, దివ్యాంగులు ఉంటారు, వేలు - లక్షల మందికి ఉపాధిని కల్పించే ఉద్యోగపతులు ఉంటారు, వందల మందికి వైద్యం చేసే వైద్యులు ఉంటారు. సంఘ సేవకులు, గోవు/ధర్మ రక్షకులు కూడా ఉంటారు. అందరికీ ఆరోగ్యం, పరిస్థితులు సహకరించవు. ఆ సమయంలో ఎన్నో మంచి పనులు చేసేవారేమో? ఎన్నో ప్రాణాలను నిలబెట్టే వారేమో?

హిందువులలో చిచ్చు పెట్టడానికి, ఇది కూడా ఒక రకమైన విష ప్రచారమే. కేవలం హిందూత్వాన్నే మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. ఇతర మతాల జోలికి మాత్రం వెళ్లే సాహసం చేయరు. ఒకవేళ నిజంగా సదుద్దేశమే ఉంటే, అలా కేవలం ఆలయాల్లోనే కాకుండా ప్రతీ చోట అమలు చేయాలి. ఆలయాల్లో వి.ఐ.పి బ్రేక్ దర్శనాలను వినియోగించే వారిలో అధికారులు, రాజకీయ నాయకులు, తీర్పులు ఇచ్చే జడ్జీలు కూడా ఉన్నారు. వారు కూడా అన్నీ చోట్ల ప్రత్యేక వసతులను, సదుపాయాలను త్యజించాలి. మరి దానికి సిద్దమా?

Wednesday, June 10, 2026

మూడు కోతులు

3 కోతుల concept
చైనా లో పుట్టి
జపాన్ లో పెరిగి
గాంధీ తో famous అయింది.

అసలు కోతులను హనుమంతుని అవతారంగా భావిస్తే, హిందువులు ఆటవిడుపు లేదా హాస్యం కోసం వానరాలను వాడుకోరు.

Monday, June 8, 2026

కట్టర్ హిందూ

" కట్టర్ హిందూ " అంటే ఏంటో అందరికీ సులభంగా అర్థమయ్యే, సరళమైన భాషలో చెప్పాలంటే :

" ఆశా, శ్వాసా, ధ్యాసా "
కేవలం హిందుత్వమే, హిందూ బంధుత్వమే

"మానసా, వాచా, కర్మణా"
" మనసులో " హిందుత్వమే
" మాటల్లో " హిందుత్వమే
" చేతల్లో "" కూడా " హిందుత్వమే

" కొరకున్ " (కొరకు), " కై "
సనాతన హిందుత్వం " కొరకు " - "ఆరాటం"
హిందువుల " హక్కులు " , " భద్రత " " కై " - " పోరాటం "

" To " Hindus, " For " Hindus, " By " Hindus.

" ఆలోచనల్లో " హిందుత్వమే
" ఆచరణలోనూ " హిందుత్వమే

గోమాతల " సంరక్షకుడు "
సనాతన హిందూ ధర్మ " రక్షకుడు "
సంస్కృతి, సంప్రదాయాల " పరిరక్షకుడు "

" ఆకాంక్ష "

" శ్రీ రామ రాజ్యమే "
" అఖండ భారతావనే "
" సనాతన ధర్మ పాలనే "

Wednesday, June 3, 2026

సంస్కృతాన్ని రక్షించండి

సంస్కృతం ఒక దైవ బాష. సంస్కృతంలో నుండి ఎన్నో భాషలు పుట్టుకు వచ్చాయి. ఇతర భాషల్లో సాంస్కృత పదాలు చేర్చబడ్డాయి. ఆధ్యాత్మికంగా చెప్పాలంటే, దాదాపు ప్రతీది సంస్కృతంలోనే ఉంటుంది. ఉదాహరణకు వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, శాస్త్రాలు, శ్లోకాలు, మంత్రాలు ఇలా ప్రతీది. సంస్కృతం యుగాల నుండి ఉన్నది. అత్యంత ప్రాచీన బాష సంస్కృతం.

అలాంటి సంస్కృత బాష నేడు కనుమరుగయ్యే దీనస్థితిలో ఉంది (అధికారిక రికార్డుల్లో). నిజ జీవితంలో అయితే భారతీయుల్లో, ముఖ్యంగా హిందువుల దైనందిన జీవితంలో, సంస్కృతం ఒక భాగం. హిందువు అన్నవాడు రోజుకు కనీసం ఒక్క శ్లోకం అయినా చదువుతాడు, చదవకపోతే చదవాలి. ఆ లెక్కన చూస్తే, అందరికీ సంస్కృతం వచ్చనే కదా దాని అర్థం?

అధికారిక రికార్డుల కోసం లేదా లెక్కల కోసం ఎవరైనా మిమ్మల్ని సంప్రదిస్తే లేదా అడిగితే, మీకు వచ్చిన భాషల్లో సంస్కృతం కూడా ఒకటని చెప్పండి. ప్రభుత్వం, భాషల బాగు కోసం, ఇచ్చే ప్రోత్సాహకాల కోసమైనా అలా చెప్పండి. సంస్కృతాన్ని బ్రతికించిన వారిమి అవుతాము.