Saturday, May 9, 2026

మాతృ దినోత్సవం

మాతృ దినోత్సవం, విదేశీయులు చేసుకుంటారు. అక్కడ పిల్లలకు 15 సంవత్సరాలు రాగానే, లేదా తల్లిదండ్రులు విడి విడిగా ఉంటారు కాబట్టి, ఆ వంకతో అయినా తల్లిని తలచుకోవడానికి జరుపుకుంటారు.

భారతదేశంలో కుటుంబ వ్యవస్థ విదేశాల కంటే చాలా బలంగా ఉంది. ఇక్కడ దాదాపు చనిపోయే వరకు అందరూ కలిసే ఉంటారు. కాబట్టి మనం ప్రత్యేకించి మాతృ దినోత్సవం, పితృ దినోత్సవం, తల్లిదండ్రులు దినోత్సవం, తాతముత్తాతల దినోత్సవం, కుటుంబ దినోత్సవం, సోదర సోదరిల దినోత్సవం జరుపుకోవాల్సిన అవసరం ఏమంత మాత్రం లేదు.

*భారతదేశంలో ప్రతి రోజూ పండుగ లాంటిదే.*

మన సనాతన హిందూ ధర్మం, మన సంస్కృతి, సంప్రదాయాలు, మన పెద్దలు-పూర్వికులు నేర్పిన కుటుంబ విలువలు, కట్టుబాట్లు అంత ఉన్నతమైనవి మరి.

అందుకే, మన ఆచారాలను ఆచరించండి, సంస్కృతి, సంప్రదాయాలను నిలబెట్టండి, తద్వారా మన ధర్మాన్ని కూడా కాపాడండి.

సనాతన హిందూ జనాః సుఖినో భవన్తు.

No comments:

Post a Comment