Saturday, May 23, 2026

హిందుత్వం అంటే ఖర్చా?

డబ్బులు ఏమీ ఖర్చు చేయకుండా, తిరుపతి లాంటి ప్రముఖ ఆలయాల్లో కూడా ఉచిత దర్శనం చేసుకొని, భోజనం కూడా చేసి రావచ్చు.

ఉచిత దర్శనం లేదా?

అన్నదానం చేయడం లేదా?

తొందరగా వెళ్లాలి అనుకునే వారికి ప్రత్యేక దర్శన టికెట్.

ఈ మధ్య నాస్తికులు, హిందూ ద్వేషులు, మరకలు, గొర్రెలు రకరకాల కుట్రలు పన్నుతున్నారు. అందులో ఒక రకమైన కుట్ర ఇది.

వాళ్లు చెప్పాలనుకున్నది ఏంటి అంటే, హిందుత్వం అంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అని.

అగరబత్తులకు, టెంకాయలకు, దర్శనానికి, అర్చకుని పళ్లెంలో వేయడానికి దక్షిణ, హుండీలో వేయడానికి దానం, బిక్షగాలకు వేయడానికి దానం, చెప్పుల స్టాండు టికెట్, పార్కింగ్ లాట్ లో టికెట్టు - ఇలా ఇన్ని రకాల ఖర్చులు ఉంటాయి.

అంటే, హిందువులు ఆలయానికి వెళ్లాలంటే, దేవుడి దర్శనం చేసుకోవాలంటే, ఇన్ని రకాల ఖర్చులు అని. అదే మా చర్చిలో అయితే, ఎటువంటి ఖర్చు లేదు అని చెప్పుకుంటారు.

కానీ నిజానికి హిందువులు దీపారాధన చేస్తే, క్రైస్తవులు కొవ్వొత్తులు వెలిగించరా? ఏంటి కొవ్వొత్తులు ఊరికే వస్తాయా డబ్బులు లేకుండా?

దర్గాలపైన కప్పడానికి చాదర్ లు తీసుకెళ్తారు, అవి ఊరికి వస్తాయా?

ఈ పార్కింగ్ లాట్లు, టోకెన్లు చెప్పుల స్టాండ్ లో ఇవన్నీ ఉండేవి ప్రముఖ దేవాలయాల్లో మాత్రమే. అత్యంత రద్దీగా ఉండే దేవాలయాల్లో మాత్రమే. అన్ని దేవాలయాల్లో అలాంటి పరిస్థితి ఉండదు.

ఇక రద్దీగా ఉండే ప్రదేశాల్లో, పార్కింగ్ లకి ప్రతిదానికి వేరు వేరుగా ఖర్చు చేయాల్సి వస్తుంది. సినిమా కెళ్లినా సరే, సినిమా థియేటర్లో ఖర్చు చేయరా? దర్గాల్లో టెంకాయకి వంద రూపాయలు తీసుకొని ఇవ్వరా?

ఏదో మంత్రం పేరు చెప్పి వందలు, వేలు లాగరా?

దయ్యం పట్టిందని వంకలు చెప్పి, భయపెట్టించి, వేల రూపాయలు లాగరా?దాని గురించి ఎందుకు ఎవరూ మాట్లాడరు?

ప్రభువు దానం చేయమన్నాడు అనేసి, దానం చేస్తే మంచిదనేసి, చర్చికి వచ్చే వాళ్లతో బియ్యం సంచిలు కొనిపించి తెచ్చుకోరా?

నాకు తెలిసిన కొందరు మతం మారినా హిందువులు, లక్షల కొద్ది అప్పు చేసి మరీ దానాలు చేస్తున్నారు. చర్చి కోసము బియ్యం సంచులని, బట్టలు అనేసి అలాంటివే మరి కొన్ని. దాని గురించి మాట్లాడరేంటి?

ఉత్త చేతులతో గుడికి పోయి, దేవుడికి దండం పెట్టుకొని వచ్చేవారు లేరా?

అంతెందుకు శివయ్యకు ఓ చెంబుడు నీళ్లతో అభిషేకం చేస్తే, ప్రసన్నుడు కాడా ఏంటి?

హిందువులను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు, హిందుత్వం అంటేనే ఖర్చు అని.

ఉత్త చేతులతో గుడికెళ్లి కూడా దండం పెట్టుకుని రావచ్చు, వీలైతే ఒక చెంబెడు నీళ్లు, లింగంపై పోసినా చాలు. గుడుల బాగోగులు చూసుకోవడానికి, ప్రభుత్వం ఉంది, ఈ రోజుల్లో రాజులు లేరు కాబట్టి. ఆలయాల నుంచి వచ్చే డబ్బు/ఆదాయం హిందువులకు మాత్రమే ఖర్చు చేయాలని అడగండి. అంతేగాని దానికి ఇంత టికెట్, దీనికి ఇంత టికెట్ అని అనకండి. సెక్యులర్ పార్టీలకు ఓటు వేసి, వారిని గెలిపించి, వారికి అధికారం ఇస్తే, ఇలాంటివే జరుగుతాయి. కాబట్టి కట్టర్ హిందూ పార్టీలకు మాత్రమే ఓటు వేసి గెలిపించాలి. అప్పుడుగాని మన గుడుల నుంచి వచ్చే ఆదాయం, మన గుడులకు, హిందువులకు మాత్రమే ఖర్చు చేస్తారు. దీనికి పరిష్కారం - పార్టీలు, బూటకపు సెక్యులరిజం ప్రదర్శించకుండా చూసుకోవాలి. కేవలం కట్టర్ హిందూ పార్టీలకు మాత్రమే ఓటు వేయాలి, అధికారాన్ని అందించాలి.

No comments:

Post a Comment