Tuesday, March 10, 2026

సమానమా? ఎక్కువ సమానమా?

పురుషులకు రక్షణ లేని రోజులు ఇవి. సగటు మగాడికి రక్షణ లేకుండా పోతోంది.
పురుషులకు భద్రత కల్పించాలి.
చట్టాలు - స్త్రీల వైపు
ప్రజా సంఘాలు, మానవ సంఘాలు - స్త్రీల వైపు
ఆఖరికి పురుషులు కూడా - స్త్రీల వైపే
మరి పురుషుల వైపు? ఎవరు లేరు
ఒక మగాడు తన గోడు ఎవరికి చెప్పుకోవాలి ఇక?

పురుష చట్టాలు రావాలి
మగవారిని స్త్రీల నుండి రక్షించాలి
ఒక మగాడి మనసును, సాటి మగాడే అర్థం చేసుకోగలడు
గృహ హింసకు గురైన పురుషులు, స్త్రీ పీడితులు, మహిళా బాధితులు ఏకం కావాలి
మగవారి ఐక్యత వర్ధిల్లాలి
పురుష జనోద్ధరణ జరగాలి

పురుషుడి విజయం, ఆడవాళ్లకు కట్ట బెట్టినప్పుడు
స్త్రీల విజయం, మగవాళ్లకు ఎందుకు కట్టబెట్టరు?
స్త్రీ పక్షపాతమా?
ఎవరి పోరాటం వారిది
ఎవరి జీవితం వారిది
స్త్రీ, పురుషులు అని విడదీయడం ఎందుకు?
మనిషి, మనుషులు అంటే సరిపోదా?

"స్త్రీ పురుషుడితో సమానం అంటూనే, స్త్రీని పురుషుడి కన్నా ఎక్కువ సమానం చేసేశారు. పురుష ఆధిక్య సమాజాన్ని కాస్త, స్త్రీ ఆధిక్య సమాజంగా మార్చేశారు."


ఇంకా స్త్రీ పక్షపాతం వహించడం మూర్ఖత్వమే అవుతుంది.
అదీ - ఇప్పుడు, ఈ రోజుల్లో కూడా.
100% నిజాయితీగా ఉండాలి అంతే.
అనునిత్యం, ఎల్లవేళలా సత్యం వైపు నిలబడాలి అంతే. పూర్తి నిబద్ధతతో ఉండాలి.
మనం చూడాల్సింది - న్యాయమా, అన్యాయమా అని మాత్రమే.
Just wrong or right, we should see and care about it.

నిజం ఎటు ఉంటే నేను అటు ఉంటా.
స్త్రీల వైపు ఉంటే, నేను కూడా సమర్ధిస్తా.
పురుషుడి వైపు ఉంటే, నేను ఒక మగాడిలానే ఆలోచిస్తా.
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపే వారు, పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేయాలి.

No comments:

Post a Comment