అన్నీ తెలిసిన వారి కన్నా
దేవుడు
ఏమీ తెలియని వారిని బాగా ఇష్ట పడతాడు
నిర్మలంగా, నిష్కల్మషంగా ఉండే వారంటే
దేవుడికి చాలా ఇష్టం
శాస్త్రోక్తంగా పూజలు చేసే వారి కన్నా
తెలిసీ తెలియక అపచరాలను చేసి
మనస్పూర్తిగా పూజించే వారిని
క్షమించి, ప్రేమగా దగ్గరకు తీసుకుంటాడు
భగవంతుడిపై మనకు
అపారమైన నమ్మకం ఉండాలి
అచంచలమైన భక్తి, ప్రగాఢ విశ్వాసం ఉండాలి
ఇక నీవే నాకు దిక్కంటూ
నీవు తప్ప నాకు వేరే దిక్కులేదంటూ
సర్వాంతర్యామి అయిన ఆ భగవంతుడిని వేడుకోవాలి
భారమంతా ఆ దేవుడిపై వేస్తూ
భగవంతుడిపై స్వచ్ఛమైన, నిశ్చలమైన భక్తి భావంతో
పూర్తి నమ్మకంతో
సమర్పణ భావంతో, చిత్తశుద్ధితో
శ్రద్ధతో, ఏకాగ్ర చిత్తంతో
మనని మనం
ఆ దేవ దేవుడికి అర్పించుకోవాలి.
No comments:
Post a Comment