నిన్న భోగి రోజు ఒకావిడ, భోగి స్పెషల్ ఏంటి? అని నన్ను అడిగింది.
నేనేమో అమాయకంగా, గొబ్బెమ్మలు అని చెప్పాను.
దానికి ఆమె, అబ్బా, గొబ్బెమ్మలను తింటారా? అని అన్నది.
నేను అమాయకంగా, తినడానికి స్పెషల్ అని అడగలేదుగా? అని అన్నాను.
అదేంటో గానీ విచిత్రంగా, మా ఇంటి ఎదురుగా ఉండే కుక్క, మా ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను తిన్నది.
అదే విషయాన్ని తనతో చెబితే, " అది కుక్క, మనుషులు కాదు కదా తినేది? అందుకే దాన్ని కుక్క అన్నారు" అని సమాధానం ఇచ్చింది.
మనుషులు తిననినివి వేరే ప్రాణులు తింటాయిగా? అని గుర్తుకు వచ్చింది అంతలో.
ఏంటో, ఎంత బుర్ర గోక్కున్నా, ఎంతగా తల బాదుకున్నా, ఈ లోకం తీరుతెన్నులు అస్సలు అర్దం అయి చావట్లేదు రామచంద్ర ప్రభు.
అంతా ఉరుకులు పరుగుల గడబిడ లోకం. లోకమే తలకిందులైందా? లేక నేను లోకాన్ని తలకిందులుగా చూస్తున్నానా?
~ సాహిత్య పిపాసి, సత్తెకాలపు శ్రీకాంత్ పిల్లనగ్రోవిల
No comments:
Post a Comment