Tuesday, January 14, 2025

ఉప్పుగూడలో భోగి పండుగ ఉత్సవాలు

ఉప్పుగూడలో 13 జనవరి 2025 సోమవారం రోజు, భోగి పండుగ సందర్భంగా, తెల్లవారుజామున నిద్రలేచి, భోగిమంటను వెలిగించి, చిన్నా పెద్దా అంతా చలి కాచుకున్నారు. ఆడువారు కలాపి చల్లి, ముగ్గులు వేసి, ఆవు పేడతో గొబ్బెమ్మలను చేసి, ముగ్గు మధ్యలో 5 గొబ్బెమ్మలను పెట్టి, గొబ్బెమ్మలకు పసుపు కుంకుమలు పెట్టి, గొబ్బెమ్మలపై పువ్వులను గుచ్చి, అగరబత్తీలు వెలిగించారు. చెరుకు ముక్కలు, క్యారెట్ ముక్కలు, రేగు పండ్లు, శెనగ ఆకుల కూర గింజలు, నవదాన్యాలు తదితరాలను భూమాతకి నైవేద్యంగా సమర్పించారు. నువ్వుల లడ్డూలను దేవుడికి నైవేద్యంగా పెట్టి, ప్రాసాదాన్ని ఆరగించారు. ఇళ్లలో కలగూర వండుకొని తిన్నారు.

No comments:

Post a Comment