రాత్రి పూట, స్మశానంలో, శవం కాలుతుండగా, మంత్ర జపం చేసి, ఆత్మను అదుపులోకి తెచ్చుకొని, ఆత్మకు రక రకాల మాంసాహారం, మద్యపానం వంటివి ఇచ్చి ఆత్మను సంతోషపరచి, ఎవరికైతే బాణామతి చేయాలో వారి ఫోటో లేదా వారు వేసుకునే బట్టలను చూపించి, ఆత్మని సదరు వ్యక్తిపైకి ఉసిగొల్పుతారు.
బాణామతి పీడితులు, తిండి సరిగా తినరు, సరిగా నిద్ర కూడా పోరు. తిండి, నిద్ర సరిగా లేకపోవడంతో చంపలు లొట్టబడతాయి, చర్మం ముడతలు పడుతుంది. మతి స్థిమితం కోల్పోయి, పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తారు. ఎదేదో లేనిపోనివి ఊహించుకుంటారు. psychiatrist భాషలో schizophrenia అని పిలుస్తారు. ఏదైనా వైద్యం చేయిస్తే, బాగా లావెక్కుతారు, చాలా నిద్రపోతుంటారు. ఉదరభాగం చాలా ఎత్తుగా కనిపిస్తుంది.
మామూలుగా అందమైన, పేరున్న ఆడవారిపైనే ఎక్కువగా బాణామతిని ప్రయోగిస్తారు. వారికి పెళ్ళి కావొద్దని, పిచ్చి పట్టి బట్టలు చించుకోవాలని, బట్టలు చించుకొని, రోడ్లపై నగ్నంగా తిరగాలని, ఆ యువతి, ఆమె కుటుంబ సభ్యులు అప్రతిష్ట పాలు కావాలని, ఈర్ష్య, ద్వేషం పగతో చేస్తారు.
బాణామతికి గురైన వారు, తరుచూ బట్టలు చించేసుకుంటారు, ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి- పారిపోవడానికి చూస్తుంటారు, ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తుంటారు. అలా వారితో దెయ్యం చేయిస్తుంటుంది. వారిని చాలా కనిపెట్టుకొని ఉండాలి. చిన్న గాజు ముక్క, ట్యబ్లెట్ కవర్, బ్లేడు, కత్తి వగైరా లాంటి పదునైనవి, మందులు అందుబాటులో ఉంచవద్దు. అలాంటివారి చేతికి గాజులు కూడా ఉంచవద్దు, గాజులు పగలగొట్టుకొని, నరం కోసుకుంటారు.
బాణామతి ప్రభావం 11 లేదా 21 సంవత్సరాల వరకు ఉంటుంది. బాణామతి ప్రబావం తగ్గే సమయంలో బాగా సన్నబడిపోతారు. అలా సన్నబడ్డ ఏడాది లోపు పెళ్ళి చేసేయాలి, లేకపోతే చనిపోతారు.
బాణామతికి చికిత్స చాలా కష్టసాధ్యమైనది. ఒకవైపు మందులు తినిపిస్తూనే, భూతవైద్యుడి చేత చికిత్స చేయించాలి. బాణామతికి గురైన వారికి హైదరాబాదులో, ఎర్రగడ్డ ప్రాంతంలో ఉచితంగా చికిత్స చేస్తారు. మెదడుకు కరెంట్ షాక్ లు ఇస్తారు. సికింద్రాబాద్ అల్వాల్ లో, కవుకూర్ ప్రాంతంలో, దర్గాలో అలాంటి వారిని గొలుసులతో నెలలు, సంవత్సరాల తరబడి కట్టేసి పెడతారు. హనుమంతుడు బాగు చేయగలడు.
No comments:
Post a Comment