Thursday, July 25, 2024

చిత్ర - విచిత్రమైన బాధ

బాధలో పుట్టి
బాధలోనే పెరిగి
బాధతోనే జీవితాన్ని గడిపేస్తున్న వాడికి
బాధే ఒక జీవితం
జీవితమే ఒక బాధ 😞

అందరికి బాధలు బియ్యంలో రాళ్లలా ఉంటాయ్,
కానీ నాకేమో రాళ్లలో బియ్యంలా ఉన్నాయ్ 😞

ముందు చూస్తే నుయ్యి
వెనుక చూస్తే గొయ్యి
ఇరువైపులా, పక్కలో బల్లెం
ఆకాశంలోకి ఎగరాలేను
అథః పాతాళంలోకి దూకనూలేను
నిల్చున్నదేమో ముళ్లకంప పైన 😞

పెరిగే మొక్కపై ఎదగకుండ, రాయి పెట్టినట్లుంది
గొంతు చించుకొని మొత్తుకుంటున్న గొంతులో, గుడ్డ కుక్కినట్లుంది
కన్నీటి కడలిలో కొట్టుమిట్టాడుతున్నత్లుంది😞

ఎవరినని నిందించనూ?
ఎవరి వైపు వేలెత్తి చూపనూ?

సీత బాధ సీతది
పీత బాధ పీతది 😞

No comments:

Post a Comment