Friday, October 30, 2026

కృష్ణ నామ రసం - 2

ఇంకా ఏ పదాలు మిగిలాయని కృష్ణా, నేను నిన్ను కీర్తించడానికి?
ఎన్ని నోళ్ళతో, ఎంత కీర్తించినా తక్కువే, ఆ శ్రీ కృష్ణుడిని!

ఎన్ని జన్మలెత్తినా తరగని కథ నీది
ఎంత పాడినా తీరని గానం నీది

నీ మురళి మ్రోగితే చాలు, ముల్లోకాలు మైమరచు
నువ్వు చిరునవ్వులు చిందిస్తే చాలు, చీకట్లు తొలగిపోవు

గీతను పలికిన జగద్గురువు నీవే
గోపికల మనసు దోచిన చిన్ని కన్నయ్యవు, చిలిపి కృష్ణుడవూ నీవే

నీ పాదమే మోక్షం - నీ నామమే మంత్రం
నీ దయ ఉంటే చాలు - దక్కును ఈ జన్మకు సార్థక్యం

నీ నామ రసాన్ని, ఎంత త్రాగినా దాహం తీరదు
నిన్ను చూసే దాకా, నీ దరిచేరేదాకా, నా ఈ వ్యాధ మారదు

నీ నామ రసం, మధురాతి మధురం కృష్ణా

No comments:

Post a Comment