శ్రీ కృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో మనిషి ఎలా ఉండాలో చెప్పారు.
ఇంకా వివరంగా మనిషి ఏం చేయాలో, ఏమి చేయకూడదో వేదాలలో చెప్పబడినది, వేదాలు చదివి తెలుసుకోమని అర్జునుడికి చెప్పాడు.
వేద వాక్కు అంటే, దేవుడి వాక్కు. వేదంలో చేయకూడదు అని చెప్పినవి చేస్తే, అది పాపం. ధర్మ విరుద్దమైనవి, ధర్మానికి వ్యతిరేకమైన కర్మలు / పనులే పాపాలు.
Wednesday, January 29, 2025
కర్మ ఫలం
ధర్మో రక్షతి రక్షితః - "ధర్మాన్ని మనము అనుసరిస్తే / ఆచరిస్తే / రక్షిస్తే, ఆ ధర్మమే మనల్ని తిరిగి రక్షిస్తుంది"
కర్మ ఫలం మనల్ని ఎప్పుడూ వెంటాడుతుంది. మన కర్మ ఫలం మన దగ్గరకు తిరిగి వస్తుంది.
మనం ఒకరికి మంచి చేస్తే, మనకి తిరిగి మంచి జరుగుతుంది.
మనం ఒకరికి చెడు చేస్తే, మనకు తిరిగి చెడు జరుగుతుంది.
ఇప్పటికిప్పుడే కాకపోయినా, ఎన్ని జన్మలకైనా, మన కర్మ ఫలం మనల్ని వదిలిపెట్టదు.
మనం ఇప్పుడు అనుభవిస్తున్న కష్ట - సుఖాలు, మన పూర్వ జన్మల కర్మ ఫలమే.

Monday, January 20, 2025
బాణామతి
రాత్రి పూట, స్మశానంలో, శవం కాలుతుండగా, మంత్ర జపం చేసి, ఆత్మను అదుపులోకి తెచ్చుకొని, ఆత్మకు రక రకాల మాంసాహారం, మద్యపానం వంటివి ఇచ్చి ఆత్మను సంతోషపరచి, ఎవరికైతే బాణామతి చేయాలో వారి ఫోటో లేదా వారు వేసుకునే బట్టలను చూపించి, ఆత్మని సదరు వ్యక్తిపైకి ఉసిగొల్పుతారు.
బాణామతి పీడితులు, తిండి సరిగా తినరు, సరిగా నిద్ర కూడా పోరు. తిండి, నిద్ర సరిగా లేకపోవడంతో చంపలు లొట్టబడతాయి, చర్మం ముడతలు పడుతుంది. మతి స్థిమితం కోల్పోయి, పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తారు. ఎదేదో లేనిపోనివి ఊహించుకుంటారు. psychiatrist భాషలో schizophrenia అని పిలుస్తారు. ఏదైనా వైద్యం చేయిస్తే, బాగా లావెక్కుతారు, చాలా నిద్రపోతుంటారు. ఉదరభాగం చాలా ఎత్తుగా కనిపిస్తుంది.
మామూలుగా అందమైన, పేరున్న ఆడవారిపైనే ఎక్కువగా బాణామతిని ప్రయోగిస్తారు. వారికి పెళ్ళి కావొద్దని, పిచ్చి పట్టి బట్టలు చించుకోవాలని, బట్టలు చించుకొని, రోడ్లపై నగ్నంగా తిరగాలని, ఆ యువతి, ఆమె కుటుంబ సభ్యులు అప్రతిష్ట పాలు కావాలని, ఈర్ష్య, ద్వేషం పగతో చేస్తారు.
బాణామతికి గురైన వారు, తరుచూ బట్టలు చించేసుకుంటారు, ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి- పారిపోవడానికి చూస్తుంటారు, ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తుంటారు. అలా వారితో దెయ్యం చేయిస్తుంటుంది. వారిని చాలా కనిపెట్టుకొని ఉండాలి. చిన్న గాజు ముక్క, ట్యబ్లెట్ కవర్, బ్లేడు, కత్తి వగైరా లాంటి పదునైనవి, మందులు అందుబాటులో ఉంచవద్దు. అలాంటివారి చేతికి గాజులు కూడా ఉంచవద్దు, గాజులు పగలగొట్టుకొని, నరం కోసుకుంటారు.
బాణామతి ప్రభావం 11 లేదా 21 సంవత్సరాల వరకు ఉంటుంది. బాణామతి ప్రబావం తగ్గే సమయంలో బాగా సన్నబడిపోతారు. అలా సన్నబడ్డ ఏడాది లోపు పెళ్ళి చేసేయాలి, లేకపోతే చనిపోతారు.
బాణామతికి చికిత్స చాలా కష్టసాధ్యమైనది. ఒకవైపు మందులు తినిపిస్తూనే, భూతవైద్యుడి చేత చికిత్స చేయించాలి. బాణామతికి గురైన వారికి హైదరాబాదులో, ఎర్రగడ్డ ప్రాంతంలో ఉచితంగా చికిత్స చేస్తారు. మెదడుకు కరెంట్ షాక్ లు ఇస్తారు. సికింద్రాబాద్ అల్వాల్ లో, కవుకూర్ ప్రాంతంలో, దర్గాలో అలాంటి వారిని గొలుసులతో నెలలు, సంవత్సరాల తరబడి కట్టేసి పెడతారు. హనుమంతుడు బాగు చేయగలడు.

Tuesday, January 14, 2025
ఉప్పుగూడలో భోగి పండుగ ఉత్సవాలు
ఉప్పుగూడలో 13 జనవరి 2025 సోమవారం రోజు, భోగి పండుగ సందర్భంగా, తెల్లవారుజామున నిద్రలేచి, భోగిమంటను వెలిగించి, చిన్నా పెద్దా అంతా చలి కాచుకున్నారు. ఆడువారు కలాపి చల్లి, ముగ్గులు వేసి, ఆవు పేడతో గొబ్బెమ్మలను చేసి, ముగ్గు మధ్యలో 5 గొబ్బెమ్మలను పెట్టి, గొబ్బెమ్మలకు పసుపు కుంకుమలు పెట్టి, గొబ్బెమ్మలపై పువ్వులను గుచ్చి, అగరబత్తీలు వెలిగించారు. చెరుకు ముక్కలు, క్యారెట్ ముక్కలు, రేగు పండ్లు, శెనగ ఆకుల కూర గింజలు, నవదాన్యాలు తదితరాలను భూమాతకి నైవేద్యంగా సమర్పించారు. నువ్వుల లడ్డూలను దేవుడికి నైవేద్యంగా పెట్టి, ప్రాసాదాన్ని ఆరగించారు. ఇళ్లలో కలగూర వండుకొని తిన్నారు.
భోగి స్పెషల్
నిన్న భోగి రోజు ఒకావిడ, భోగి స్పెషల్ ఏంటి? అని నన్ను అడిగింది.
నేనేమో అమాయకంగా, గొబ్బెమ్మలు అని చెప్పాను.
దానికి ఆమె, అబ్బా, గొబ్బెమ్మలను తింటారా? అని అన్నది.
నేను అమాయకంగా, తినడానికి స్పెషల్ అని అడగలేదుగా? అని అన్నాను.
అదేంటో గానీ విచిత్రంగా, మా ఇంటి ఎదురుగా ఉండే కుక్క, మా ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను తిన్నది.
అదే విషయాన్ని తనతో చెబితే, " అది కుక్క, మనుషులు కాదు కదా తినేది? అందుకే దాన్ని కుక్క అన్నారు" అని సమాధానం ఇచ్చింది.
మనుషులు తిననినివి వేరే ప్రాణులు తింటాయిగా? అని గుర్తుకు వచ్చింది అంతలో.
ఏంటో, ఎంత బుర్ర గోక్కున్నా, ఎంతగా తల బాదుకున్నా, ఈ లోకం తీరుతెన్నులు అస్సలు అర్దం అయి చావట్లేదు రామచంద్ర ప్రభు.
అంతా ఉరుకులు పరుగుల గడబిడ లోకం. లోకమే తలకిందులైందా? లేక నేను లోకాన్ని తలకిందులుగా చూస్తున్నానా?
~ సాహిత్య పిపాసి, సత్తెకాలపు శ్రీకాంత్ పిల్లనగ్రోవిల

Subscribe to:
Posts (Atom)