Sunday, September 10, 2023

ఉప్పుగూడలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

ఉప్పుగూడ రక్షా పురం కాలనీ, శ్రీ శివాలయం ప్రాంగణములో గల, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో, సెప్టెంబర్ 7వ తేదీ 2023 గురువారం రోజు, సాయంత్రం 6.30 గంటలకు, శ్రీ కృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని, శ్రీ కృష్ణుడికి అభిషేకం చేసి, ఊయలలో విగ్రహాన్ని ప్రతిష్ఠించి, పూల మాలలతో పుష్పాలంకరణ చేసి, శ్రీ కృష్ణుడిని రమనీయంగా తీర్చి దిద్ది, తులసి దళములతో పత్రి పూజ చేసి, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పూజ అనంతరం తీర్థ ప్రసాదాలను వితరణ చేశారు. భక్తులు తమ పిల్లలని చిన్ని కృష్ణుడిగా, రాధగా, గోపిక లాగ ముస్తాబు చేసి వెంటబెట్టుకురాగా, చిన్ని కృష్ణ వేషదారులు తమ అల్లరితో సందడి చేశారు.

Tuesday, September 5, 2023

Iday nidhi stalin

Uday nidhi stalin is more dangerous than malaria, dengue and Corona virus who needs to be eradicated immediately from Bharath.

Who are you Mr.Uday nidhi stalin and what's your capability to eradicate Sanathana Dharma? How dare you to give such a statement about Sanathana Dharma?

Try to protect yourself first and then try to eradicate. People like you should be behind the bars forever for making such a stupid statement.

Tuesday, August 15, 2023

ఉప్పుగూడలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

హైదరాబాద్ పాతబస్తి ఉప్పుగూడలో పలుచోట్ల స్వాతంత్ర్య దినోత్సవాన్ని, బస్తీ వాసులు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా భారత జాతీయ జెండాను ఎగురవేసి, త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. మిఠాయి పొట్లాలను పంచారు. జాతీయ గీతమైన జనగణమనను ఆలపించారు. త్రివర్ణ పతాకానికి వందనాలు చేశారు. తానాజీ నగర్ కమ్యూనిటీ హాల్ మరియు విశ్వకర్మ సంఘం వద్ద, ఛత్రిమేట్ శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం వద్ద, అరుంధతి కాలనీ బ్రిడ్జి ఆటో డ్రైవర్ల యూనియన్ వద్ద, 3 టైలర్ షాపుల కూడలి అరుంధతి కాలనీ, న్యూ రక్షాపురం కాలనీ, రక్షా పురం కాలనీ కూడలి, మొదలగు పలుచోట్ల స్వాతంత్ర యోధులను స్మరించుకొని నివాళులర్పించారు. వందేమాతరం, భారత్ మాతాకీ జై, జై హింద్ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు.

Friday, August 11, 2023

ఏం చేయాలి?

నా సర్టిఫికెట్లు, పతకాలు, షీల్డ్‌లు, ట్రాక్ సూట్లు, షూస్ అన్నీ పోగొట్టుకున్నాను. సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు కూడా లేవు. ఇంట్లో నుంచే పోయాయి. బయటి వాళ్ళు ఎవరు రాలేదు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా, మళ్ళీ వాటిని తిరిగి పొందడం ఎలా?

ఒకవేళ ఇంట్లోవాళ్ళే ఒక మనిషి ప్రతిష్టని పాడు చేస్తే? అతని పరువుకి భంగం కలిగిస్తే? మాన మర్యాదలకు నష్టం కలిగిస్తే? అతని ప్రాణాలకు హాని చేకూర్చాలని చూస్తే ? ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా, మెల్లి మెల్లిగా అతన్ని చంపాలని చూస్తే? విలువల పరంగా, నైతికంగా అతడు ఏం చేయాలి? చట్ట ప్రకారం ఏం చేయొచ్చు?

Wednesday, May 10, 2023

మనసుంటే మార్గముంటది

మనసుంటే మార్గముంటది. క్షణికావేశానికి లోనై అనవసరంగా తొందరపడి మీ జీవితాన్ని అంతమొందించుకోవద్దు. ధృడ సంకల్పంతో పరిస్థితులతో పోరాడండి. శతకోటి అపాయాలకు అనంతకోటి ఉపాయాలు. ఏదైనా అపాయం ఎదురైనప్పుడు, బయటపడేందుకు సరైన ఉపాయం కోసం వెదకాలి గాని, అంతమొందించుకోవాలని చూడొద్దు.

Tuesday, March 28, 2023

శ్రీ రామనవమి సంధర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు

ఉప్పుగూడ రక్షాపురం కాలనీ శ్రీ ఉమామహేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణములో, నెలకొనియున్న శ్రీ కోదండ రామస్వామి ఆలయములో, శ్రీ రామ నవమి సంధర్బముగా మార్చి 30వ తేదీ 2023 గురువారం రోజు, ఉదయం 5 గంటలకు ప్రదోష పూజలు, విష్ణు సహస్రనామ పారాయణము, శ్రీ రాముల వారికి పంచామృత అభిషేకం మరియు అలంకారము నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల 30 నిమిషాలకి శ్రీ కోదండ రామస్వామి వార్ల కళ్యాణ మహోత్సవము, అనంతరం ఆశీర్వచనములు, తీర్థప్రసాదముల వితరణ, తదుపరి మధ్యాహ్నం 1 గంటకు అన్నదాన కార్యక్రమము. సాయంత్రం 5 గంటల 30 నిమిషాల నుండి శ్రీ కోదండరామస్వామి వారికి, పురవీధులలో పల్లకి ఊరేగింపు మహోత్సవము ఘనంగా నిర్వహింప తలపెట్టినట్టు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని, కార్యక్రమాన్ని జయప్రదం చేసి, రాములోరి ఆశీర్వచనములు పొందగలరని, శ్రీ శివాలయం ఆలయ కార్య నిర్వహణ అధికారి పార్థ సారధి తెలియచేశారు.

Tuesday, March 21, 2023

ఉప్పుగూడలో తెలుగు కొత్త సంవత్సారానికి ఘనంగా స్వాగతం పలుకుతున్నారు

హైదరాబాద్ పాత బస్తి ఉప్పుగూడలో తెలుగు వారు శోభకృత్ నామ సంవత్సర ఉగాది పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఇళ్ల ముందు రకరకాల రంగవల్లులను తీర్చిదిద్దారు. ఇంటి ద్వారాలకు మామిడాకులతో తోరణాలు కట్టారు. యువతి యువకులు సంప్రదాయబద్ధమైనటువంటి కొత్త బట్టలను ధరించారు. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు కలగలసిన షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని గుళ్ళల్లలో దేవుళ్ళకి నైవేద్యంగా సమర్పించారు. అనంతరం ఉగాది పచ్చడిని రుచి చూసాక ఆహారాన్ని ఆరంగించారు. తెలంగాణా ప్రాంతంలో ఉగాది పచ్చడిని ద్రవ రూపంలో తయారు చేయడం ఆనవాయితీగా వస్తోంది. పంచాంగ శ్రవణం కోసం ఆలయాలలో తెలుగు ప్రజలు గుమికూడారు. శోభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలను తెలుసుకునేందుకు జ్యోతిష్య పండితుల ఇళ్ల ముందు జనాలు బారులు తీరారు. నేటి సాయంత్రం నిర్వహించబోయే కవి సమ్మేళనం గురించి చర్చించుకుంటున్నారు. పిల్లల అల్లరి చేష్టలు, పెద్దల హడావుడితో అందరి ఇళ్లు నిండైన తెలుగుదనంతో కళకళలాడుతూ ఉన్నాయి.

Friday, March 17, 2023

దేశానికి మేలు తలపెట్టినట్టా?

గడ్డం పెంచినంత మాత్రాన, ఆ గడ్డం నెరిసినంత మాత్రాన మనిషికి పరిపక్వత వచినట్టా? పాద యాత్ర చేసినంత మాత్రాన ప్రజల కష్టాన్ని తెలుసుకున్నట్టా ? వారి కష్టాలు తీర్చినట్టా? విదేశాల్లో దేశ ప్రతిష్టను దిగజారుస్తుంటే, దేశానికి మేలు తలపెట్టినట్టా?

Tuesday, March 7, 2023

ఉప్పుగూడలో రంగులతో హోలీ సంబరాలు

హైదరాబాద్ పాతబస్తీ ఉప్పుగూడలో సోమవారం రోజు రాత్రి తానాజీ నగర్ కామ్యునిటీ హాల్ కూడలి వద్ద కామ దహన కార్యక్రమం జరిగింది.

మంగళవారము రోజు ఉదయం నుండి పిల్లలు, యువత రకారకాల రంగులతో హోలీ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. పిల్లలు పిచికారీలతో వివిధ రంగులని ఒకరిపై ఒకరు పిచికారీ చేసుకుంటున్నారు. యువత అనేక రంగులని ఒకరి మొహంపై ఒకరి పూసుకుంటున్నారు, రంగులని బస్తీవాసులపై వెదజల్లుతున్నారు, రంగు నీతిని కుమ్మరిస్తున్నారు. డప్పుల మోతతో హోరెక్కించి, ఆనంద పరవశంతో నృత్యాలు చేస్తున్నారు. రంగులతో నిండిన మొహాలని ఒక్కసారిగా గుర్తుపట్టడం కాసింత కష్టమవుతోంది. తమ రంగులమయమైన మోహాలని అద్దంలో చూసుకొని మురిసిపోయి, నవ్వేసుకుంటున్నారు. ఎటువైపు చూసినా అరుపులు, కేకలు, కేరింతలతో అందరి మోహాల్లో చిరునవ్వులు చిగురిస్తున్నాయి.

Sunday, February 5, 2023

మద్యం మత్తులో తూగుతున్న యువత

ఉప్పుగూడ అరుంధతి కాలనీ కల్లు దుకాణంలో, ఫిబ్రవరి 5 2023 ఆదివారం రోజు ఉదయం 11 గంటలకు, పూటుగా తాగి బయటే కూర్చుండిపోయిన యువకుడు. ఉన్న కాస్త స్పృహతోనే డబ్బులు ఇచ్చి ఇంకా మద్యం తీసుకురావాలని స్నేహితునికి పురమాయించాడు. యువత మద్యానికి బానిసై పొద్దు పొద్దున్నే రోడ్లపై ఊగుతూ తూగుతూ అడ్డదిడ్డంగా నడుస్తున్నారు. ఎవరు ఎప్పుడు ఎవరిపైనా పడతారో తెలియని పరిస్థితి. మద్యం మత్తులో వాహనాలకు అడ్డంగా వచ్చేస్తున్నారు, అడిగితే గొడవలకు దిగుతున్నారు. విక్రయదారులు పరిమితికి మించి అమ్మడంతో ఇలాంటి పరిస్థితులు నెలకొంటున్నాయి. ఒక్కచోటనే కాదు, మద్యం దుకాణాల చుట్టుపక్కల ఇదే పరిస్థితి నెలకొంది. కొన్నిచోట్ల మైనర్లు, చిన్న పిల్లలు కూడా సిబ్బందితో మధ్యాన్ని తెప్పించుకొంటున్నారు. పలువురు స్థానికులు మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని కోరుతున్నారు.

Monday, January 16, 2023

మీ రోగ నిరోదక శక్తిని ఇలా నడిచి పెంచుకోండి

చైనాలో కరోనా విజృంభిస్తుండడంతో మన దేశంలోని ప్రజల్లో కూడా మళ్ళీ భయాందోళనలు మొదలయ్యాయి. కరోనాని ధీటుగా ఎదుర్కోడానికి రోగ నిరోదక శక్తిని పెంచుకోవడమే ఉత్తమ ఉపాయం. అందులోనూ కేవలం నడక ద్వారా రోగాలని తట్టుకునే శక్తిని పెంపొందించుకోవడమనేది తేలికైన మార్గం. అది కూడా కేవలం పది నిమిషాలు నడిచి దగ్గు, దమ్ము, ఆస్తమా, సైనసైటీస్, ఊపిరితిత్తుల ఇంఫెక్షన్, మతిమరుపు, రక్తంలోని మలినాలని తొలగించుకోవడం అత్యంత సులువైన బ్రహ్మ ప్రాణాయామంతో సాద్యమని యోగ గురువు అరుణా దేవి ఒక యూటూబ్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

ఎలా చేయాలి అంటే: మనం నడిచేటప్పుదు మొదటి నాలుగు అడుగులు ఊపిరి పీల్చాలి, తరువాతి నాలుగు అడుగులు ఊపిరిని బిగపట్టాలి, తదుపరి నాలుగు అడుగులు ఊపిరిని వదులుతూ వేయాలి. ఒకవేళ నాలుగేసి అడుగులు కష్టమనిపిస్తే, మూడేసి అడుగులు చేయాలి. కఫం వస్తే దాన్ని వెంటనే ఉమ్మి వేయాలి. ఏం చేసినా రక్తపోటు అదుపులో లేని వారు దీనిని ప్రయత్నించవద్దని సూచించారు. ఇలా రోజూ ఓ పది నిమిషాలు నడిస్తే చాలని యోగా గురువు అరుణా దేవి తెలియజేశారు.

Sunday, January 15, 2023

పాతబస్తిలో ఘనంగా సంక్రాంతి సంబరాలు

హైదరాబాద్ పాతబస్తి ఊప్పుగూడలో సంక్రాంతిని నగరవాసులు ఘనంగా జరుపుకున్నారు. ఆడపడుచులు తమ ఇళ్ళ ముందు వాకిట్లో అనేక రంగులతో రకరకాల రంగవల్లులను ముచ్చటగొలిపేలా తీర్చిదిద్దారు. ముగ్గుల మద్యలో గొబ్బెమ్మలను పసుపు కుంకుమలతో, పూలతో, అగరొత్తులతో పేర్చారు. నేల తల్లికి రేగుపళ్ళు, చెరుకు, వేరుశనగకాయలు, క్యారెట్, బీట్రూట్, గేంగులు, నవదాన్యాలతో నివేదించారు. సూర్యభగవానుడికి ఎర్రటి పండ్లని సమర్పించారు. పిల్లలు గాలిపటాలని ఎగురవేస్తు మద్య మద్యలో తమ తమ ఇళ్ళలో చేసినటువంటి ఘుమఘుమలాడే రకరకాల పిండి వంటలను కరకరలాడిస్తూ గడిపారు. యువత ఆట పాటలతో హోరెత్తించారు.