చైనాలో కరోనా విజృంభిస్తుండడంతో మన దేశంలోని ప్రజల్లో కూడా మళ్ళీ భయాందోళనలు మొదలయ్యాయి. కరోనాని ధీటుగా ఎదుర్కోడానికి రోగ నిరోదక శక్తిని పెంచుకోవడమే ఉత్తమ ఉపాయం. అందులోనూ కేవలం నడక ద్వారా రోగాలని తట్టుకునే శక్తిని పెంపొందించుకోవడమనేది తేలికైన మార్గం. అది కూడా కేవలం పది నిమిషాలు నడిచి దగ్గు, దమ్ము, ఆస్తమా, సైనసైటీస్, ఊపిరితిత్తుల ఇంఫెక్షన్, మతిమరుపు, రక్తంలోని మలినాలని తొలగించుకోవడం అత్యంత సులువైన బ్రహ్మ ప్రాణాయామంతో సాద్యమని యోగ గురువు అరుణా దేవి ఒక యూటూబ్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
ఎలా చేయాలి అంటే: మనం నడిచేటప్పుదు మొదటి నాలుగు అడుగులు ఊపిరి పీల్చాలి, తరువాతి నాలుగు అడుగులు ఊపిరిని బిగపట్టాలి, తదుపరి నాలుగు అడుగులు ఊపిరిని వదులుతూ వేయాలి. ఒకవేళ నాలుగేసి అడుగులు కష్టమనిపిస్తే, మూడేసి అడుగులు చేయాలి. కఫం వస్తే దాన్ని వెంటనే ఉమ్మి వేయాలి. ఏం చేసినా రక్తపోటు అదుపులో లేని వారు దీనిని ప్రయత్నించవద్దని సూచించారు. ఇలా రోజూ ఓ పది నిమిషాలు నడిస్తే చాలని యోగా గురువు అరుణా దేవి తెలియజేశారు.
No comments:
Post a Comment