Tuesday, March 28, 2023
శ్రీ రామనవమి సంధర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు
ఉప్పుగూడ రక్షాపురం కాలనీ శ్రీ ఉమామహేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణములో, నెలకొనియున్న శ్రీ కోదండ రామస్వామి ఆలయములో, శ్రీ రామ నవమి సంధర్బముగా మార్చి 30వ తేదీ 2023 గురువారం రోజు, ఉదయం 5 గంటలకు ప్రదోష పూజలు, విష్ణు సహస్రనామ పారాయణము, శ్రీ రాముల వారికి పంచామృత అభిషేకం మరియు అలంకారము నిర్వహించనున్నారు.
ఉదయం 10 గంటల 30 నిమిషాలకి శ్రీ కోదండ రామస్వామి వార్ల కళ్యాణ మహోత్సవము, అనంతరం ఆశీర్వచనములు, తీర్థప్రసాదముల వితరణ, తదుపరి మధ్యాహ్నం 1 గంటకు అన్నదాన కార్యక్రమము.
సాయంత్రం 5 గంటల 30 నిమిషాల నుండి శ్రీ కోదండరామస్వామి వారికి, పురవీధులలో పల్లకి ఊరేగింపు మహోత్సవము ఘనంగా నిర్వహింప తలపెట్టినట్టు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని, కార్యక్రమాన్ని జయప్రదం చేసి, రాములోరి ఆశీర్వచనములు పొందగలరని, శ్రీ శివాలయం ఆలయ కార్య నిర్వహణ అధికారి పార్థ సారధి తెలియచేశారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment