Thursday, August 7, 2025

నా బతుకు నన్ను బతకనివ్వండి
నా చావేదో నన్ను చావనివ్వండి

చిరిగిన, చితికిన
అతుకుల, గతుకుల
బతుకులు మావి

అతికిస్తే - అతకదు
కుడితే - కుట్టు నిలవదు
పూడిస్తే - మరో పెద్ద గుంత పడుతుంది

పోరాడీ పోరాడీ, అలసి సొలసి, కిందపడి ఉన్నవాడిని, ఏదో నిట్టూర్చుకుంటూ, అయినా ఎక్కడో, ఏదో ఒక మూలన, చిన్ని ఆశతో, ఏమో, ఇప్పుడయినా ఏమైనా సాధిస్తానేమోనని, చిరు/చివరి ప్రయత్నంగా -

ఓపిక చేసుకొని, శక్తినంతా కూడదీసుకొని, మిగిలిన అరకొర ఉత్సాహంతో పైకి లేవడానికి చూస్తే - ఈసారి, పేద్ద కొండ రాయే వచ్చి పడుతుంది.

ఇది కదా, కాదు కాదు, ఇదే కదా మా అసలుసిసలు సగటు దిగువ తరగతి బతుకులు అంటే?

ఇంతకంటే క్లుప్తంగా, ఇంకేమీ చెప్పగలను నా నిజ జీవితం గురించి, గడిచిన నా గత జీవితం గురించి?

No comments:

Post a Comment