అమ్మో, నాకు పరీక్షలు అంటే బయం. ఒక్కోసారి ఐతే జ్వరం కూడా వచ్చేది. ఇక ఎకనామిక్స్ ఎగ్జామ్ ఉందీ అంటే చాలు, ఎక్కడ నుంచి వస్తుందో ఏమో తల నొప్పి, ఎంతకీ పోదు. ఎకనామిక్స్ లో బలహీనంగా ఉండె కాబట్టే, డబ్బు సంపాదనలో వెనకబడ్డానేమో.
వృక్షశాస్త్రం అంటే కూడా అంతే. క్లాసులు వినలేక పోయే వాళ్లం. బోటనీ మేడం ఏమో మమ్మల్ని బలవంతంగా క్లాస్‌లో గంటలు గంటలు కూర్చోబెట్టేది. ఒక గంట వినడమే కష్టం అంటే.
No comments:
Post a Comment