Monday, January 16, 2023

మీ రోగ నిరోదక శక్తిని ఇలా నడిచి పెంచుకోండి

చైనాలో కరోనా విజృంభిస్తుండడంతో మన దేశంలోని ప్రజల్లో కూడా మళ్ళీ భయాందోళనలు మొదలయ్యాయి. కరోనాని ధీటుగా ఎదుర్కోడానికి రోగ నిరోదక శక్తిని పెంచుకోవడమే ఉత్తమ ఉపాయం. అందులోనూ కేవలం నడక ద్వారా రోగాలని తట్టుకునే శక్తిని పెంపొందించుకోవడమనేది తేలికైన మార్గం. అది కూడా కేవలం పది నిమిషాలు నడిచి దగ్గు, దమ్ము, ఆస్తమా, సైనసైటీస్, ఊపిరితిత్తుల ఇంఫెక్షన్, మతిమరుపు, రక్తంలోని మలినాలని తొలగించుకోవడం అత్యంత సులువైన బ్రహ్మ ప్రాణాయామంతో సాద్యమని యోగ గురువు అరుణా దేవి ఒక యూటూబ్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

ఎలా చేయాలి అంటే: మనం నడిచేటప్పుదు మొదటి నాలుగు అడుగులు ఊపిరి పీల్చాలి, తరువాతి నాలుగు అడుగులు ఊపిరిని బిగపట్టాలి, తదుపరి నాలుగు అడుగులు ఊపిరిని వదులుతూ వేయాలి. ఒకవేళ నాలుగేసి అడుగులు కష్టమనిపిస్తే, మూడేసి అడుగులు చేయాలి. కఫం వస్తే దాన్ని వెంటనే ఉమ్మి వేయాలి. ఏం చేసినా రక్తపోటు అదుపులో లేని వారు దీనిని ప్రయత్నించవద్దని సూచించారు. ఇలా రోజూ ఓ పది నిమిషాలు నడిస్తే చాలని యోగా గురువు అరుణా దేవి తెలియజేశారు.

Sunday, January 15, 2023

పాతబస్తిలో ఘనంగా సంక్రాంతి సంబరాలు

హైదరాబాద్ పాతబస్తి ఊప్పుగూడలో సంక్రాంతిని నగరవాసులు ఘనంగా జరుపుకున్నారు. ఆడపడుచులు తమ ఇళ్ళ ముందు వాకిట్లో అనేక రంగులతో రకరకాల రంగవల్లులను ముచ్చటగొలిపేలా తీర్చిదిద్దారు. ముగ్గుల మద్యలో గొబ్బెమ్మలను పసుపు కుంకుమలతో, పూలతో, అగరొత్తులతో పేర్చారు. నేల తల్లికి రేగుపళ్ళు, చెరుకు, వేరుశనగకాయలు, క్యారెట్, బీట్రూట్, గేంగులు, నవదాన్యాలతో నివేదించారు. సూర్యభగవానుడికి ఎర్రటి పండ్లని సమర్పించారు. పిల్లలు గాలిపటాలని ఎగురవేస్తు మద్య మద్యలో తమ తమ ఇళ్ళలో చేసినటువంటి ఘుమఘుమలాడే రకరకాల పిండి వంటలను కరకరలాడిస్తూ గడిపారు. యువత ఆట పాటలతో హోరెత్తించారు.