Tuesday, September 30, 2025

మొబైల్ ఫోన్ పూజ

ఈ రోజు దుర్గాష్టమి కదా?

దుర్గాష్టమి రోజు ఆయుధ పూజ చేస్తారు, ఆయుధం మనకు బాగా సహకరించాలని.

ఈ రోజుల్లో మనిషికి మొబైల్ ఫోన్ ఒక ఆయుధం లాంటిది, ముఖ్యంగా నా లాంటి వారికి.

పూజ చేసేటప్పుడు, అభిషేకం చేయడం ఆనవాయితీ.

అందుకే, మీ మీ మొబైల్ ఫోన్ పై నీరు పోసి అభిషేకం చేశారా ఇంతకి?

Sunday, September 7, 2025

ఇష్టం వర్సెస్ ప్రేమ

ఒక మనిషి లేదా వారి ఆలోచనలు లేదా ఆలోచించే విధానం, అలవాట్లు నచ్చితే అది "ఇష్టం" అనబడుతుంది.

ఆ "ఇష్టం" బాగా ముదిరితే - "ప్రేమ" అవుతుంది.

ఒకసారి ఆ "ప్రేమ" పుట్టాక - అయిష్టాలు కూడా ఇష్టాలుగా మారిపోతాయి. ప్రేమించిన వారు, ఎన్ని నచ్చని పనులు చేసినా పట్టించుకోరు. కొన్నిసార్లు కొందరైతే ఎంత ఘోరమైన పనులు చేసినా కూడా, చూసీ చూడనట్టుగానే ఉండిపోతారు, వారి మీద ఉన్న "వల్లమాలిన ప్రేమ" వల్ల.

అది తప్పో లేక ఒప్పో కూడా విచక్షణ లేకుండా మరీ హద్దులు దాటి ఇష్టపడటమే "ప్రేమ" అంటే, క్లుప్తంగా చెప్పాలంటే.