Monday, January 15, 2024
ఊప్పుగూడలో సందడిగా సంక్రాంతి సంబరాలు
హైదరాబాద్ పాతబస్తి ఊప్పుగూడలో, 15 జనవరి 2024 సోమవారం రోజు, సంక్రాంతి పండుగ సంధర్భంగా, సంక్రాంతిని బస్తీవాసులు చాలా సందడిగా జరుపుకుంటున్నారు. తెలుగింటి మగువలు తమ ఇంటి ముందు వాకిట్లో, వర్ణ రంజికమైన రంగులతో, రకరకాల రంగవల్లులను చూడ ముచ్చటగా తీర్చిదిద్దారు. కొందరైతే అయోధ్య రామ మందిరాన్ని చిత్రించారు. ముగ్గుల మద్యలో గొబ్బిళ్ళను పసుపు కుంకుమలతో, పూలతో, అగరొత్తులతో అమర్చారు. భూమాతకి రేగుపళ్ళు, చెరుకుముక్కలు, వేరుశనగకాయలు, క్యారెట్, బీట్రూట్, గేంగులు, నవదాన్యాలను సమర్పించారు. సూర్యభగవానుడికి దండం పెట్టుకొని, తమకి రోగ నిరొదక శక్తిని, ఆరోగ్యాన్ని ప్రసాదించమని వేడుకుంటూ, నువ్వుల లడ్డూలను ఆరగిస్తున్నారు. పిల్లలు గాలిపటాలను ఎగరేస్తూ పోటీ పడుతున్నారు. గాలిపటం తెగిపడగానే 'కాట్' అని కేకలు, అరుపులు. ఇళ్లల్లోంచి అనేక రకాల పిండి వంటల ఘుమఘుమలు. యువకులు డీజే లు ఏర్పాటు చేసి ఆట పాటలతో, నృత్యాలతో హోరేత్తిస్తున్నారు.
Subscribe to:
Posts (Atom)