నా ఆల్ టైమ్ ఫేవరెట్ క్రికెటర్ మరెవరో కాదు
క్రికెట్ దేవుడు
"సచిన్ టెండూల్కర్"
సచిన్ బ్యాటింగ్ తోనే క్రికెట్ చూడడం మొదలు పెట్టా
సచిన్ రిటైర్మెంట్ తో నేను క్రికెట్ చూడడం మానేశా.
అప్పుడప్పుడు అనిపిస్తుంది, సచిన్ రిటైర్మెంట్ న్యూస్ విని నాకు గుండెపోటు రాకుండా ఎలా ఉందీ అని.
ఓ చేతిలో బాల్ ఇంకో చేతి లో బ్యాట్.
బౌలింగ్ కోసం వచ్చి, బ్యాట్స్‌మెన్ గా సెలెక్ట్ అయ్యి, బ్యాటింగ్‌లో దాదాపు అన్నీ రికార్డులు బద్దలు కొట్టి, ఇంకెవరికి సాధ్యపడని రికార్డులు సృష్టించి, క్రికెట్ వేగాన్నే పెంచేసిన 100 కోట్ల గుండె చప్పుడు "సచిన్".