నేటి సమాజానికి ఒక చిన్న విన్నపం
ప్రజలలో చైతన్యం రావాలి. సంఘ సేవ అంటే ఏంటో తెలియాలి. సమాజనికి సేవ చేయడమంటె బిల్ గేట్స్ లా దానాలు చేయడం, మదర్ థెరీసా లా వాంతి చేసుకుంటే చేయిలో పట్టడం, కుష్టురోగులకి సేవలు చేయడం, రామకృష్ణ పరమహంస లా మురికివాడలని శుబ్రం చేయడమే కాదు. చిన్న చిన్న పనులు చేసి కూడా మనం మన సమాజం బాగుపడేలా చేయొచ్చు.
ఉదాహరణకి ఎవరికైనా ప్రమాదం జరిగితే వెంటనే 102 / 104 / 108 (అంబులెన్సె) కి కాల్ చేయడం, ఎక్కడైన నిప్పంటుకుంటే 101 (ఫైర్ / అగ్ని మాపక దళం) కి కాల్ చేయడం, ఎవరైన సంఘ విద్రోహులు కనిపిస్తే లేక సంఘ విద్రోహక చర్య జరుగుతుంటె 100 (పోలీస్) కి కాల్ చేయడం, బిల్ గేట్స్ లా కాకపోయినా , మీ ఒక్క రోజు సంపాదన లేక ఒక్క రోజు ఖర్చు లేక రోజుకి రూ. 1 / 2 / 3 ఇలా ఎవరికి ఎలా వీలు ఐతె అలా ఈ సమాజ శ్రేయస్సు కొరకు / బాగు కొరకు ఖర్చు చేయండి చాలు. మనకి ఈ లోకం ఏం ఇచ్చిందని మనం ఈ లోకం కోసం ఖర్చు చేయడం అని అనుకుంటె, మనం ఈ లోకానికి ఎమీ ఇవ్వకుండా, దాని నుంచి మనం ఆశించడం ఎంత వరకు సబబు మీరే చెప్పండి ? మీరు మీ చుట్టూ ఉన్న వారికి సాయం చేస్తే వారి నుంచి మీకు సాయం పొందే అవకశం, ఆశించే ఆస్కారం వుంది. మీరు మీ చుట్టూ ఉన్న వారికి సాయపడకుండా, నాలో దేశభక్తి వుంది, నేను ఈ దేశం కోసం అది చేయాలనుకుంటున్నా, ఇది చేయాలనుకుంటున్నా అనుకుంటె అది ఉత్త దండగ. ఎందుకంటే, దేశమంటె కేవలం మట్టి కాదు కాబట్టి, అందులో మనుషులు కూడా ఉంటారు కాబట్టి.
నేను ఈ సమాజం కోసం అది చేయాలనుకుంటున్నా, ఇది చేయాలనుకుంటున్నా అని మాటలతో సరిపెడుతూ కాలం వెళ్ళదీసే వారూ ఉన్నారు. వాళ్ళు అలా అలోచించుకుంటూ, అనుకుంటూ కూర్చోడం కన్నా, ఆ వట్టి మాటలు ఏవో కాస్త కట్టి, ఓ మూలన పెట్టి – గట్టి మేలు ఒకటి తలపెట్టాలి, ఆ ఆలోచన కాస్త కార్య రూపం దాల్చాలి. ఆనుకున్న పనిని ఏదో ఆచరణలో పెట్టాలి. ఎందుకంటె , అందరూ నీతులు చెప్పేవారే కాని, పనులు చేసే వారు లేరు. ఆలోచనలని ఆచరణలో పెట్టేవారు లేరు. మీరు స్వయంగా సంఘ సేవ చేయలేకపోతే, కనీసం వారు చేసే పనిని మెచ్చుకోండి, ప్రోత్సహించండి, చేసేవారికి సాయపడండి, కాని వారిని ఎగతాళి మాత్రం చేయొద్దు, చూసి నవ్వుకోవద్దు. ఎందుకంటె మంచిని ఎప్పుడు కూడా మనం ప్రోత్స హించాలి , చెడుని ఎప్పుడు కూడా నిలువరించాలి.